వేమన 26 (100-103)

వేమన భావజాలం


100.తాత్విక                   కడుపు నిండ సుధనుగ్రమము తో ద్రావిన 
పాల మీదనేల పారు మనసు ?
తత్వ మేరుగ వెనుక తత్వంబు లేటికో !

తాత్పర్యం

అమృతం వంటి జ్ఞానం పొందినవాడు చిన్నచిన్న విషయాలపై మనసు పెట్టకూడదు. నిజమైన తత్వజ్ఞానం పొందిన తరువాత ఇతర వ్యర్థ విషయాలకు విలువ ఉండదని వేమన భావం.

101.తాత్విక    ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద :                        మహిమ ఁజూపు వాడు మధ్యముండు ;                  వేష ధారి , యుదర పోషకుడ ధముండు .

తాత్పర్యం

నిజమైన తత్వజ్ఞాని అత్యున్నతుడు. అతని మహిమను గుర్తించి గౌరవించేవాడు మధ్యముడు. కేవలం వేషధారణతో జీవనం సాగించే వాడు అధముడు అని వేమన తీవ్రంగా విమర్శిస్తున్నాడు.

102.తాత్విక      హృదయమందు నున్న యీశుని దెలియక ,
శిలలకె ల్ల మ్రొక్కు జీవులార !
శిలలనే మి యుండు జీవులందే కాక ?

తాత్పర్యం

 హృదయంలో ఉన్న దేవుణ్ణి గ్రహించకుండా రాళ్లకు నమస్కరించడం ఎందుకు అని వేమన ప్రశ్నిస్తున్నాడు. ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందని ఆయన మానవతా దృష్టితో చెబుతున్నాడు.

103.ప్రేరణ                          గంగి గోవు పాలు గంటెడై నను జాలు ;
ఖరము పాలు కడివె డైననే మి 
భక్తి ఁగలుకు కూడు పట్టెడైనను జాలు .

తాత్పర్యం 

మంచి గోవు పాలు కొద్దిగా ఉన్నా చాలు, గాడిద పాలు ఎక్కువగా ఉన్నా ప్రయోజనం లేదు. అలాగే భక్తితో ఇచ్చిన చిన్న కానుక కూడా విలువైనదే అని వేమన చెప్పాడు..

CONCEPT ( development of human relations and human resources )