01.05.వేమన శతకం ref books

1.vemana🙏శతకం హైదరాబాద్ ప్రచురణ🙏

https://dn710903.ca.archive.org/0/items/in.ernet.dli.2015.330046/2015.330046.Vemana-Shethakamu.pdf

2015.386242.mana-vemana_text.pdf

🌹

2.vemana🙏శతకం ఆరుద్ర 

https://archive.org/details/in.ernet.dli.2015.386242

🌹🌹
3.vemana🙏శతకం సీపీ బ్రౌన్ 

The Verses Of Ve'Mana, Moral, Religious And Satirical. Translated By Charles Philip Brown, Of The Madras Civil Service, Vēmana. https://play.google.com/store/books/details?id=hGZWAAAAcAAJ

🌹🌹🌹


వేమన శతకము – అధ్యయన వనరులు



1. చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు,
కొంచెమైన నదియు కొదువ కాదు,
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత,
విశ్వదాభిరామ వినుర వేమా.


2. ఆత్మ శుద్ధి లేని యాచారమదియేల?
బాండాశుద్ధి లేని పాకమేల,
చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా?
విశ్వదాభిరామ వినుర వేమా.


3. గంగిగోవుపాలు గంటెడైనను చాలు,
కడివెడైననేమి ఖరముపాలు,
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.


4. నిక్కమైన మంచినీలమొక్కటిచాలు,
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల,
చాటుమిలను చాలదా యొక్కటి,
విశ్వదాభిరామ వినుర వేమా.


5. మిరపగింజచూడా మీద నల్లగనుండు,
గొరికిజూడ లోన జుఱుకు మనును,
సజ్జనులగువారి సారమిట్లుండురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


6. మృగదంబుజూడ మీద నల్లగనుండు,
బరిఢవిల్లు దాని పరిమళంబు,
గురువులైనవారి గుణములీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


7. మేడిపండుచూడ మేలిమై యుండు,
పొట్టవిప్పిచూడ పురుగులుండు,
పిరికి వాని మదిని బింకమీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


8. నెరనన్నవాడు నెరజాణ మహిలోన,
నేరునన్నవాడు నిందజెందు,
ఊరుకున్నవాడే యుత్తమయోగిరా,
విశ్వదాభిరామ వినుర వేమా.


9. గంగ పారునెపుడు గదలని గతితోడ,
మురికివాగు పారు మ్రోతతోడ,
పెద్ద పిన్న తనము పేర్మియీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


10. నిండునదులు పారు నిలిచి గంభీరమై,
వెర్రివాగు పారు వేగంబొర్లి,
అల్పుడాడు రీతి అధికుండు నాడునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


11. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను,
సజ్జనుండు బల్కు జల్లగాను,
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


12. కులములోన నొకండు గుణవంతుడుండిన,
కులము వెలయు వాని గుణముచేత,
వెలయు వనములోన మలయజంబున్నట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.


13. పూజకన్నా నెంచ బుద్ధి ప్రధానంబు,
మాటకన్న నెంచ మనసు దృఢము,
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు,
విశ్వదాభిరామ వినుర వేమా.


14. ఉత్తముని కుడువున నోగు జన్మించిన,
వాడు జెఱచు వాని వంశమెల్ల,
జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల?
విశ్వదాభిరామ వినుర వేమా.


15. కులముల్లోన నొకడు గుణహీనుడుండిన,
కులము చెడును వాని గుణమువలన,
వెలయు జెఱుకునందు వేను వెడలినట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.



16 నుండి 50 వరకు ఇదే విధంగా కొనసాగుతుంది.

వేమన శతకం – 16 నుండి 50 వరకు
16. రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె,
కురుపతి జనియించి కులము జేరచె,
ఇలను పుణ్యపాప మీలాగు కాదొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.

17. హీన గుణమువాని నిలుసేరనిచ్చిన,
ఎంతవానికైనా నిడుము గలుగు,
ఈగ కడుపుజొచ్చి ఇట్టిట్ట సేయదా,
విశ్వదాభిరామ వినుర వేమా.


18. వేరుపురుగు చేరి వృక్షంబు జెరచును,
చీడ పురుగు జేరి చెట్టు చేర్చు,
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


19. అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని,
ఘనుడుగాడు హీన జనుడేగాని,
పరిమళములు మోయ గార్దభము గజమౌనె,
విశ్వదాభిరామ వినుర వేమా.


20. విద్యలేనివాడు విద్యాధికుల చెంత,
నుండినంత పండితుండుకాడు,
కొలనిహంసలకడ గొక్కెర ఉన్నట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.


21. అల్పబుద్ధి వాని అధికారమిచ్చిన,
దొడ్డవారినెల్ల దొలగజేయు,
చెప్పుందినెడి కుక్క చెరుకు తీపెరుగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


22. అల్పుడైనవాని అధిక భాగ్యముగల్ల,
దొడ్డవారి దిట్టి దొలగొట్టు,
అల్పజాతి మొప్పె యధికుల నెరుగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


23. ఎద్దుకైనగాని ఏడాది తెలిసిన,
మాట దెలిసి నడచు మర్మమెరిగి,
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన,
విశ్వదాభిరామ వినుర వేమా.


24. ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికిన,
నలుపు నలుపేగాని తెలుపురాదు,
కొమ్మబొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


25. పాముకన్న లేదు పాపిష్టిజీవంబు,
అట్టిపాము చెప్పినట్లు వినును,
ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరునులేరు,
విశ్వదాభిరామ వినుర వేమా.


26. వేము పాలు వోసి ప్రేమతో బెంచిన,
చేదు విరిగి తీపి జెందబోదు,
ఓగునోగెగాక యుచితజ్ఞు డెటులౌను,
విశ్వదాభిరామ వినుర వేమా.


27. ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు,
బరగ మూలికలకు పనికివచ్చును,
నిర్దయాత్మకుండు నీచుడెందులాకౌను,
విశ్వదాభిరామ వినుర వేమా.


28. పాలు పంచదార పాపర పండ్లలో,
చాలపోసి వండ చవికి రాదు,
కుటిల మానవులకు గుణ మేల గల్గురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


29. పాల నిడిగింట గ్రోలుచుండేనా,
మనుజులెల్ల గూడి మధ్యమండ్రు,
నిలువదగని చోట నిలువ నిందలువచ్చు,
విశ్వదాభిరామ వినుర వేమా.


30. కానివాని తోడు కలిసి మెలుగుచున్న,
గానివాని వలె కాంతురవని,
తాడి క్రింద బాలు తాగిన చందమౌ,
విశ్వదాభిరామ వినుర వేమా.



31 నుండి 50 వరకు కొనసాగుతుంది...

వేమన శతకం – 31 నుండి 50 వరకు
31. తామాశించి చేయ తగదెట్టి కార్యంబు,
వేగిరింప నదియు విషమేయగును,
పచ్చికాయ దెచ్చి బడవేయ ఫలమౌనె,
విశ్వదాభిరామ వినుర వేమా.

32. కోపమునను ఘనత కొంచమైపోవును,
కోపమును మిగుల గోడు గల్గు,
కోపమడచనేని కోర్కెలీడేరు,
విశ్వదాభిరామ వినుర వేమా.


33. నీళ్లలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు,
బయట కుక్క చేత భంగపడును,
స్థాన బలిమి గాని తన బలిమి గాదురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


34. నీళ్లలోన మీను నిగిడి దూరము పారు,
బయట మూరెడైన బారలేదు,
స్థాన బలిమి గాని తన బలిమి గాదురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


35. నీళ్ళమీద నొడ నిగిడి తిన్నగా బ్రాకు,
బయట మూరెడైన బారలేదు,
నెలవు దప్పుచోట నేర్పరి కోరగాడు,
విశ్వదాభిరామ వినుర వేమా.


36. కులము లేని వాడు కలిమిచే వెలయును,
కలిమి లేని వాడు కులము దిగును,
కులముకన్న భువిని గలిమియెక్కువసుమీ,
విశ్వదాభిరామ వినుర వేమా.


37. కులము గలుగువాడు గోత్రంబు గలవాడు,
విద్యచేత విర్రవీగువాడు,
పసిడి గలుగు వాని బానిస కొడుకులు,
విశ్వదాభిరామ వినుర వేమా.


38. కనియు గానలేడు కదలపడనోరు,
వినియు వినగాలేడు విస్మయమున,
సంపద తలవాని సన్నిపాతం బిది,
విశ్వదాభిరామ వినుర వేమా.


39. ఏమి గొంచు వచ్చె నేమి తాంగొని పోవు,
బుట్టువేళ నారడు గిట్టువేళ,
ధనము లెచటికేగు తానే చ్చటికినేగు,
విశ్వదాభిరామ వినుర వేమా.


40. తనువ దేవరి సొమ్ము తనదని పోషింప,
ద్రవ్య మెవరి సొమ్ము దాచుకొనగ,
ప్రాణ మెవరి సొమ్ము పారిపోవక నిల్వ,
విశ్వదాభిరామ వినుర వేమా.


41. గొడ్డుటావు బితుక గుండగొంపోయిన,
పండ్లు రాలదన్ను బాలవిదు,
లోభివాని నడుగ లాభంబు లేదయా,
విశ్వదాభిరామ వినుర వేమా.


42. మేక కుతుక బట్టి మెడచన్ను గుడవగా,
ఆకలేక మాను నాశగాక,
లోభివాని నడుగ లాభంబు లేదయా,
విశ్వదాభిరామ వినుర వేమా.


43. పెట్టి పోయలేని వట్టినరులు భూమి,
బుట్టనేమి వారు గిట్టనేమి,
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా,
విశ్వదాభిరామ వినుర వేమా.


44. ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు,
తిరుగుచుంద్రు భ్రమను త్రిప్పలేక,
మురికి కుండమందు ముసురు నీగల భంగి,
విశ్వదాభిరామ వినుర వేమా.


45. నీళ్లలోన మీను నెరమాంస మాశించి,
గాలమందు జిక్కు కరణి భువిని,
ఆశదగిలి నరుడు నాలాగు చెడిపోవు,
విశ్వదాభిరామ వినుర వేమా.


46. ఆశ పాపజాతి యన్నిటికంటెను,
ఆసచేత యతులు మోసపోరే,
చూచి విడచువారె శుద్ధాత్ములెందైన,
విశ్వదాభిరామ వినుర వేమా.


47. అన్నిదానములను అన్నదానమే గొప్ప,
కన్నతల్లికంటే ఘనములేదు,
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా,
విశ్వదాభిరామ వినుర వేమా.


48. ఆశకోసి వేసి యనలంబు చల్లార్చి,
గోచి బిగియగట్టి గుట్టుదెలిసి,
నిలిచినట్టు వాడే నెఱయోగి ఎందైన,
విశ్వదాభిరామ వినుర వేమా.


49. కనకమృగము భువిని గుద్దులే,
ధనకయె తరుణి విడచి చనియె,
దాసారథియు దెలివిలేనివాడు దేవుడెట్లాయెరా,
విశ్వదాభిరామ వినుర వేమా.


50. చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి,
పెరకి తినును బరుగ గ్రద్ద,
గ్రద్దవంటివాడు గజపతి కాడొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.



వేమన శతకం – 51 నుండి 100 వరకు
51. అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను,
కలనుం గాంచు లక్ష్మి కల్లయగును,
ఇలను భోగ భాగ్య మీతీరు కాదొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.

52. కోతి నొకటి దెచ్చి క్రొత్తపుట్టము గట్టి,
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు,
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు,
విశ్వదాభిరామ వినుర వేమా.


53. కల్లలాడువాని గ్రామకర్త యెరుగు,
సత్యమాడువాని స్వామి యెరుగు,
బెద్దతిండిపోతు బెండ్లామెరుంగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


54. కల్ల నిజములెల్ల గరళకంఠుడెఱుంగు,
నీరు పల్లమెరుగు నిజాముగాను,
తల్లితానెఱుంగు తనయుని జన్మము,
విశ్వదాభిరామ వినుర వేమా.


55. మైలాకోకతోడ మాసిన తలతోడ,
నొడలు మురికి తోడ నుండెనేని,
నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు,
విశ్వదాభిరామ వినుర వేమా.


56. ఉప్పులేని కూర యెప్పుడు రుచులకు,
పప్పులేని తిండి ఫలము లేదు,
అప్పులేనివాడే అధిక సంపన్నుడు,
విశ్వదాభిరామ వినుర వేమా.


57. చెట్టుపాలు జనులు చేదందు రెలలోన,
నేనుపగొద్దు పాలవెంత హితము,
పదురాడు మాట పాటియై ధర్మ జెల్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.


58. పట్టుపట్లరాదు వట్టి విడువరాదు,
పట్టెనేని బిగియ బిట్టవలెను,
పట్టిడుచుకన్న బడి చచ్చుటయే మేలు,
విశ్వదాభిరామ వినుర వేమా.


59. తప్పులెన్నువారు తండోప తండంబు,
లుర్విజనులకెల్ల నుండు దప్పు,
తప్పులెన్నువారు తమతప్పులెఱుగరు,
విశ్వదాభిరామ వినుర వేమా.


60. అనగా ననగ రాగ మాతిశయిల్లుచునుండు,
దినగదినగ వేము తియ్యగనుండు,
సాధనమున పనులు సమకూరు ధరలోన,
విశ్వదాభిరామ వినుర వేమా.



61 నుండి 100 వరకు ఇదే విధంగా కొనసాగుతుంది.

వేమన శతకం – 61 నుండి 100 వరకు
61. తనకుగల్గు పెక్కు తప్పులుండగా,
ఒరుల నేరమెంచు నొరులగాంచి,
చక్కిలంబు గాంచి జంతిక నగినట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.

62. ఇనుము విరిగెనేని యిమారు ముమ్మారు,
కాల్చి యతుకవచ్చు క్రమముగాను,
మనసు విరిగెనేని మరికూర్చ వచ్చునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


63. ఓరుని జెఱదమని యుల్లమందెంతురు,
తమకు జేరురుగని ధరణి నరులు,
తమ్ము జెఱచువాడు దైవంబులేడొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.


64. కానివానిచేత గాను వీనంబిచ్చి,
వెంట దిరుగువాడే వెఱ్ఱివాడు,
పిల్లి తిన్న కోడి బిలిచిన పలుకునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


65. మాటలాడ నేర్చి మనసు రంజిల్లజేసి,
పరగ ప్రియము చెప్పి బడలకున్న,
నొకరిచేతి సొమ్ము లూరక వచ్చునా,
విశ్వదాభిరామ వినుర వేమా.


66. చంపదగిన యట్టి శత్రువు తనచేత,
జిక్కెనేని గీడు సేయరాదు,
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.


67. వాన కురియకున్న వచ్చును క్షామంబు,
వాన కురిసెనేని వరదపారు,
వరద కరువు రెండు వారసతో నెఱుగుడీ,
విశ్వదాభిరామ వినుర వేమా.


68. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన,
బుట్టునా జగంబు పట్లడెప్పుడు,
యముని లెక్కరీతి నరుగుచు నుందురు,
విశ్వదాభిరామ వినుర వేమా.


69. వాన రాకడయును ప్రాణంబు పోకడ,
కానబడ వెంత ఘనునకైనా,
గానబడినమీద గలియెట్లు నడచురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


70. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే,
నీటిబడ్డ చినుకు నీటగలిసి,
ప్రాప్తి కలుగుచోట ఫలమేల తప్పురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


71. ఎన్నిచోట్ల తిరిగి యేపాటు పడినను,
అంటనీయక శని వెంటదిరుగు,
భూమి క్రొత్తదైనా భోక్తలు క్రొత్తలా,
విశ్వదాభిరామ వినుర వేమా.


72. కర్మమెప్పుడైన గడచిపోవగరాదు,
ధర్మరాజు దెచ్చి తగనిచోట,
గంకుభట్టు జేసే గాటకటా దైవంబు,
విశ్వదాభిరామ వినుర వేమా.


73. అనువుగానిచోట నధికుల మనరాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ యద్దమందు గొంచెమై యుండదా,
విశ్వదాభిరామ వినుర వేమా.


74. ఇమ్ము దప్పువేళ నెమ్మలన్నియు మాని,
కాలమొక్క రీతిగల గడపవలయు,
విజయడిమ్ము దప్పి విరటుని గొల్వడా,
విశ్వదాభిరామ వినుర వేమా.


75. చిక్కియున్నవేళ సింహంబునైనను,
బక్క కుక్క కఱచి బాధ పెట్టు,
బలమిలేని వేళ వంతంబు చెల్లదు,
విశ్వదాభిరామ వినుర వేమా.


76. లక్ష్మియేలినట్టి లంకాపతి పురమ్ము,
పిల్లకోతి పౌజు కొల్లబెట్టె,
చేటుకాలమయిన జేరప నల్పులే చాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.


77. మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను,
పరమలోభులైన పాపులకును,
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా,
విశ్వదాభిరామ వినుర వేమా.


78. ఇచ్చువానియొద్ద నీనివాడుండేనా,
చచ్చుగాని యీవి సాగనీడు,
కల్పతరువు క్రింద గచ్చుపోదున్నట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.


79. అరయ నాస్తియనక యడ్డుమాటాడక,
తట్టువడక మదిని దన్నుకొనక,
తనది గాదనుకొని తాబెట్టునదే పెట్టు,
విశ్వదాభిరామ వినుర వేమా.


80. ధనముగూడ బెట్టి దానంబు చేయక,
తాను దినక లెస్స దాచుకొనక,
తేనెటీగ కూర్చి తెరువర కియ్యదా,
విశ్వదాభిరామ వినుర వేమా.



81 నుండి 100 వరకు తదుపరి భాగం.

వేమన శతకం – 81 నుండి 100 వరకు
81. కొంకణంబు పోవ గుక్క సింహముగాదు,
కాశికారుగా బంది గజముకాదు,
వేరుజాతివాడు విప్రుండు కాలేడు,
విశ్వదాభిరామ వినుర వేమా.

82. తవిటి కరయవోవ దండులంబుల గంప,
శ్వాసమాక్రమించు సౌమ్యామగును,
వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.


83. దాతకానివాని దఱచుగా వేడిన,
వాడు దాతయౌనె వసుధలోన,
ఆవురు దర్భయౌనె యబ్ధిలో ముంచిన,
విశ్వదాభిరామ వినుర వేమా.


84. పరగ రాతిగుండు బగులగొట్టగ వచ్చు,
గొండలన్ని పిండి గొట్టవచ్చు,
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు,
విశ్వదాభిరామ వినుర వేమా.


85. వంపుకర్ర గాల్చి వంపు దీర్చగవచ్చు,
గొండలన్ని పిండి గొట్టవచ్చు,
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు,
విశ్వదాభిరామ వినుర వేమా.


86. విత్తముగలవాని వీపున బుండైన,
వసుధలోన జాలా వార్త కెక్కు,
బేదవానియింట బెండైన నెఱుగరు,
విశ్వదాభిరామ వినుర వేమా.


87. మగని కాలమందు మగువ కష్టించిన,
సుతుల కాలమందు సుఖమునొందు,
గలిమి లేమి రెండు గల వెంతవారికి,
విశ్వదాభిరామ వినుర వేమా.


88. తనకులేని నాడు దైవంబు దూరును,
దనకు గలిగెనేని దైవమేల,
తనకు దైవమునకు దగులాట మెట్టిదో,
విశ్వదాభిరామ వినుర వేమా.


89. గాజు కుప్పెలోన గదలక దీవంబు,
దెట్టులుండు జ్ఞాన మట్టులుండు,
తెలిసినట్టి వారి దేహంబులందున,
విశ్వదాభిరామ వినుర వేమా.


90. అంతరంగమందు నపరాధములు చేసి,
మంచివానివలెనే మనుజుడుండు,
ఇతరులెఱుగకున్న ఈశ్వరుడెఱుగడా,
విశ్వదాభిరామ వినుర వేమా.


91. చదివి చదివి కొంత చదువంగ చదువంగ,
చదువు చదివి యింక జదువు,
చదివి చదువు మర్మములను చదువలేడయ్యను,
విశ్వదాభిరామ వినుర వేమా.


92. జననమరణములకు సర్వస్వతంత్రుడు,
కాడు మొదట గర్త కాండే,
తుదనుకాడు నడుమగర్త ననుట నగుబాటు కాదొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.


93. నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు,
పాటి జగతిలేదు పరములేదు,
మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు,
విశ్వదాభిరామ వినుర వేమా.


94. తల్లియున్న యపుడె తనదు గారాబము,
లామె పోవదన్ను నరయరెవరు,
మంచికాలమపుడె మర్యాదనార్జింపు,
విశ్వదాభిరామ వినుర వేమా.


95. మాటలాడవచ్చు మనసు తెల్పగలేడు,
తెలువవచ్చుదన్ను తెలియలేడు,
సూర్యబట్టవచ్చు సూరుడు కాలేడు,
విశ్వదాభిరామ వినుర వేమా.


96. శాంతమే జనులను జామునొందించును,
శాంతముననే గురుని జాడతెలియు,
శాంత భావ మహిమ జర్చించలేమయా,
విశ్వదాభిరామ వినుర వేమా.


97. ఆడితప్పువారల అభిమాన హీనులు,
గోడెఱుగని కొద్దివారు కూడి,
కీడు సేయగ్రూరుండు తలపోయు,
విశ్వదాభిరామ వినుర వేమా.


98. తరచూ కల్లలాడు ధనీసుల ఇండ్లలో,
వేళవేళ లక్ష్మి వెడలిపోవు,
నోటికుండలోన నుండునా నీరంబు,
విశ్వదాభిరామ వినుర వేమా.


99. చంపగూడదెట్టి జంతువునైనను,
చంపవలయు లోక శత్రుగుణము,
తేలుకొండి గొట్టందే లేమి చేయురా,
విశ్వదాభిరామ వినుర వేమా.


100. ఆత్మయందే దృష్టి ననువగా నొనరించి,
నిశ్చలముగా దృష్టి నిలిపెనేని,
అతడునీవె నమ్మి యనుమానమేలరా,
విశ్వదాభిరామ వినుర వేమా.



CONCEPT ( development of human relations and human resources )