7. ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ
వ్యక్తుల ఆలోచనలు మరియు ఆచరణలపై మానసిక క్షోభ, సంఘర్షణలు, మరియు అసంతృప్తి ప్రభావం చూపుతాయని సూచించాడు.
స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది
ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే మన గురించి మనం తెలుసు కోవడమే.మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్, ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్ అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్, అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్
పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తి పేరు పెట్టుకుందట వాళ్ళమ్మ. భౌతికార్ధంలో అతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే మరో ప్రపంచాన్ని పాలించాడు.అన్వేషించాడు దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు ఎదిగాడు.
ఆస్ట్రియాకు చెందిన ఈసైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి స్టడీస్ ఆఫ్ హిస్టిరియా ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ది ఇగో అండ్ ది ఇడ్ త్రి ఎస్సేస్ ఆన్ది థియరీ ఆఫ్ సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు