01.4. తాత్వికులు జీసస్🌐


చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు – జీసస్

1. Author

సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

2. Great Poetry

అజ్ఞానపు టంధయుగంలో ఆకలి, ఆవేశం మధ్య తెలియని శక్తుల చేత నడిపించబడిన మనుషులు తమ ప్రయోజకత్వం కోసం సామ్రాజ్యాలు నిర్మించారు. ఆ క్రుత్రిమ వ్యవస్థలు చివరికి కూలిపోయాయి. చరిత్ర సంఘర్షణల ద్వారా పుట్టింది.

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసాను
– శ్రీ శ్రీ

3. Theme – జీసస్ & మానవ సంబంధాలు

మాటలకు, ప్రభోదాలకు చరిత్రను మార్చే శక్తి ఉంది. జీసస్ తన శిష్యులకు సేవ భావాన్ని నేర్పించాడు. "గొప్పవాడవ్వాలంటే ముందుగా సేవకుడవ్వాలి" అని చెప్పాడు.

4. Bible Words

“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.” – Luke 23

“పాత బట్టకు క్రొత్త మాసిక వేయరు... క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే పోయాలి.” – Matthew 9

5. జీవిత చరిత్ర

జీసస్ క్రీస్తు సుమారు 4 BCE నుండి 30 CE మధ్య జీవించారు. బెత్లహేమ్‌లో జన్మించారు. 30 ఏట బోధనలు ప్రారంభించారు.

ఆయన కరుణ, ప్రేమ, క్షమను బోధించారు. పేదలను ఆదరించారు. సిలువపై మరణించారు. మూడు రోజుల తర్వాత పునరుత్థానం పొందారని విశ్వాసం.

జీసస్ బోధనలు

1. దైవ రాజ్యం – ప్రేమ, సమానత్వం

2. “నీ పొరుగువాని ప్రేమించు”

3. క్షమా ధర్మం

4. దీనులకు సహాయం

జీసస్ బోధనలు ప్రేమ, అహింస, క్షమపై ఆధారపడ్డాయి. ఆయన తన జీవితంలో వాటిని అమలు చేసి చూపించాడు.

4. జీసస్ - మానవసంబంధాలు

మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచేయించుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు.