వేమన 95* (194 -197)

వేమన భావజాలం 

పద్యము 194

అడుగదగు వారినడిగిన 
నిడిన యెడన్ కొసర కొసరనీ లేననగా
గడుసుపడి యాసచేతా నడిగిన దుర్మార్గ వృత్తులుగురా వేమా ॥X

తాత్పర్యం

అవసరంలో ఉన్నవారు సహాయం కోరినప్పుడు, చేతనైనంత వరకు సహాయం చేయాలి. అయితే పదేపదే అడుగుతూ, లోభంతో ఇతరులను ఇబ్బంది పెట్టేవారి ప్రవర్తన దుర్మార్గమైనదని వేమన హెచ్చరిస్తున్నాడు.

భావం

అవసరానికి అడగడం మంచిది; అత్యాశతో అడగడం మంచిది కాదు.


పద్యము 195 సామజిక 

అదనెరిగిన మగువ యనువెర్గు చనువెరుగ్గు 
ముదముతోడ మగని మోహమెరుగు
విభుని శ్రేష్ఠగుణము వేశ్య తానెగ్గునా?
విశ్వదాభిరామ వినుర వేమ ॥

తాత్పర్యం

భార్య తన భర్త మనసును, ప్రేమను, అనురాగాన్ని బాగా అర్థం చేసుకుంటుంది. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సంబంధాలు కలిగించే వ్యక్తులు వెలయాలు నిజమైన గుణాలను గుర్తించలేదు .

భావం

నిజమైన ప్రేమలోనే వ్యక్తిత్వం తెలుస్తుంది; స్వార్థ సంబంధాలలో కాదు.


పద్యము 196 తాత్విక 

ఆకటికి దొలంగు నాచార విధులెల్ల
చీకటికి దొలంగు చిత్తశుద్ధి
వేకటికి దొలంగు వెనకటి బిగువెల్ల
విశ్వదాభిరామ వినుర వేమ ॥

తాత్పర్యం

ఆకలి వచ్చినవాడు ధర్మాధర్మాలను కూడా మరచిపోతాడు; అజ్ఞానాంధకారంలో మనసు యొక్క పవిత్రత కనుమరుగవుతుంది; గర్భధారణతో శరీరపు పూర్వపు లావణ్యం మారిపోతుంది."

తాత్పర్యం:

తీవ్రమైన ఆకలి మనిషిని నైతిక విలువలను కూడా మరచిపోయే స్థితికి తీసుకెళ్లగలదు.అజ్ఞానం మనస్సు యొక్క నిర్మలత్వాన్ని కప్పివేస్తుంది.గర్భధారణ స్త్రీ శరీరంలో సహజమైన మార్పులను కలిగిస్తుంది; పూర్వపు శరీరాకృతి మారడం ప్రకృతి ధర్మం.

భావం: ఈ సూక్తి మనిషి జీవితంలో శారీరక, మానసిక, సహజ పరిస్థితులు ప్రవర్తనను మరియు రూపాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలియజేస్తుంది. అలాగే ఆకలి, అజ్ఞానం వంటి పరిస్థితులను అధిగమించడానికి జ్ఞానం, కరుణ, మరియు సంయమనం అవసరమని సూచిస్తుంది.

పద్యము 197

త్రాసును , పడిసే లంజయు 

భాసుర గతినొక్క రూపు పరికింపంగా ; 

వీసంబ ' ధికంబై'న ను , 

 వాసరమున నొక్క వంక వాలుర వేమాX

తాత్పర్యం భావం 

భాసుర-వెలుగొందు, వీసంబు -కొంచెము వాసరము -ఆసరము 

"త్రాసు ఎక్కువ బరువు ఉన్న పళ్లెం వైపు వంగుతుంది; అలాగే వేశ్య ఎక్కువ డబ్బు ఇచ్చే వ్యక్తి వైపు మొగ్గు చూపుతుంది."

ఈ భావమే వేమన పద్యంలో "వాసరముననే వంక వాలుర" అనే పాదానికి దగ్గరగా ఉంటుంది.

CONCEPT ( development of human relations and human resources )