10.చరిత్ర గుంటూరు జ్ఞాపకాల నిలయం కొండవీడు ఆంధ్రప్రదేశ్
10.చరిత్ర కాలమానము @
భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను.ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం, ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.
అదేమంటే భాస్కరుడు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరుడు తను, లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.
సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.
భాస్కరుని వంశ వృక్షము:
త్రివిక్రమ -----> భాస్కరభట్ట-----> గోవింద-----> ప్రభాకర----> మనోరధ----> మహేశ్వర----> భాస్కరాచార్య----> లక్ష్మీధర.
(సా.శ.. 499), వరాహమిహిరుడు
చంద్ర, గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత
చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.
అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది.
హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది.
ఆర్యభట భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను సా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా","కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు
(6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్రలో పేరుపొందిన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ఎక్కువగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది సా.శ.. 78 లో ప్రారంభమైంది. దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది.
"హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ.. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది.
- క్రీస్తుశకం - క్రీస్తు జననం నుంచి (సా.శ.. 1)
- విక్రమశకం - విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి (క్రీ.పూ. 57)
- శాలివాహనశకం - శాతవాహనులలో పేరొందిన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించినప్పటి నుండి (సా.శ.. 78)
తెలుగు సంవత్సరాలు మొత్తం 60.
చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం.దీని ప్రకారం సంవత్సరం అంటే సుమారు 354 రోజులు. అంటే చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరాని కంటే 11 రోజుల, 1 గంటా 31 నిముషాల 12 సెకండ్లు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.
ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు.
తెలుగు నెలలు : తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం).
2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం).
తెలుగు నెలలు
ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
ఉదాహరణ ;-
- పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల చైత్రము .
- పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము.
- పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము .
- పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము.
- పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల శ్రావణము .
- పౌర్ణమి రోజున పూర్వాభాద్ర నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల భాద్రపదము.
- పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆశ్వయుజము.
- పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల కార్తీకము.
- పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మార్గశిరము .
- పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల పుష్యము.
- పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మాఘము.
- పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఫాల్గుణము.
| వసుస సంఖ్య | ఋతువు | కాలాలు | హిందూ చంద్రమాన మాసాలు | ఆంగ్ల నెలలు | లక్షణాలు | ఋతువులో వచ్చే పండగలు |
|---|---|---|---|---|---|---|
| 1 | వసంతఋతువు | Spring | చైత్రం, వైశాఖం | ~ ఏప్రిల్13 నుండి జూన్ 10 | సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం | ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి |
| 2 | గ్రీష్మఋతువు | Summer | జ్యేష్టం, ఆషాఢం | ~ జూన్ 11 నుండి ఆగస్టు 8 | బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, | వటపూర్ణిమ, రధసప్తమి, గురుపూర్ణిమ |
| 3 | వర్షఋతువు | Monsoon | శ్రావణం, భాద్రపదం | ~ ఆగస్టు 9 నుండి అక్టోబరు 6 | చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. | రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, |
| 4 | శరదృతువు | Autumn | ఆశ్వయుజం, కార్తీకం | ~ అక్టోబరు 7 నుండి డిసంబరు 4 | తక్కువ ఉష్ణోగ్రత | నవరాత్రి, విజయదశమి, దీపావళి,శరత్ పూర్ణిమ , బిహు, కార్తీక పౌర్ణమి, |
| 5 | హేమంతఋతువు | Winter | మార్గశిరం, పుష్యం | ~ డిసంబరు 5 నుండి ఫిబ్రవరి 1 | చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం | పంచ గణపతి భోగి, సంక్రాంతి,కనుమ |
| 6 | శిశిరఋతువు | Winter & Fall | మాఘం, ఫాల్గుణం | ~ ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 1 | బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలం | వసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ |
తిరుగుతున్నప్పుడు ఈ ఎక్స్పోజర్ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. సంవత్సరంలో సగం వరకు (మార్చి 20 నుండి సెప్టెంబరు 22 వరకు), ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు చిట్కాలు, గరిష్ఠ మొత్తం జూన్ 21 న సంభవిస్తుంది. సంవత్సరంలో మిగిలిన సగం వరకు, అదే జరుగుతుంది, కానీ ఉత్తరాదికి బదులుగా దక్షిణ అర్ధగోళం, గరిష్ఠంగా డిసెంబరు 21 చుట్టూ ఉంటుంది. సూర్యుడు భూమధ్యరేఖ వద్ద నేరుగా ఓవర్ హెడ్ అయినప్పుడు రెండు సందర్భాలు విషువత్తులు. ఆ సమయంలో, ఉత్తర ధ్రువం భూమి దక్షిణ ధ్రువం రెండూ కేవలం టెర్మినేటర్‌లో ఉన్నాయి, అందువల్ల పగలు రాత్రి రెండు అర్ధగోళాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. మార్చి విషువత్తు చుట్టూ, ఉత్తర అర్ధగోళం పగటి గంటలు పెరిగేకొద్దీ వసంతాన్ని అనుభవిస్తుంది పగటి గంటలు తగ్గిపోతున్నందున దక్షిణ అర్ధగోళం శరదృతువును అనుభవిస్తోంది.
సంవత్సరంలో సౌర మధ్యాహ్నం సూర్యుని రోజు పొడవు ఎత్తులో మార్పుగా అక్షసంబంధ వంపు ప్రభావం గమనించవచ్చు. శీతాకాలంలో సూర్యుని తక్కువ కోణం అంటే ఇన్కమింగ్ సౌర వికిరణం భూమి ఉపరితలం పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది, కాబట్టి అందుకున్న కాంతి మరింత పరోక్షంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. ఈ ప్రభావం తక్కువ పగటి గంటల మధ్య, భూమి అక్షసంబంధ వంపు రెండు అర్ధగోళాలలో వాతావరణంలో కాలానుగుణ వైవిధ్యానికి కారణమవుతుంది.
10.చరిత్ర అంబేద్కర్ @
10.చరిత్ర గుప్త సామ్రాజ్యం🌐
10.మహర్షి పతంజలి🌐
పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)
- యమము : అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.
- నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.
- ఆసనం: ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)
- ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.
- ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
- ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి.
- ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.
- సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
02.H.చరిత్ర అజంతా చరిత్ర
మొత్తం గుహలు: 30
అజంతాలో మొత్తం 30 రాతి గుహలు ఉన్నాయి.
చైత్య గృహాలు (పూజా మందిరాలు): 5 (గుహలు 9, 10, 19, 26, 29)
విహారాలు (మఠాలు): 25 (ఉదాహరణకు, గుహలు 1–8, 11–18, 20–25, 27, 28, 30)
ఈ గుహలు రెండు ప్రధాన దశల్లో నిర్మించబడ్డాయి:
1. హీనయాన బౌద్ధ దశ (క్రీ.పూ. 2వ శతాబ్దం – క్రీ.శ. 1వ శతాబ్దం):
చైత్య గుహలు: 9, 10
విహారాలు: 8, 12, 13, 15A, 30
2. మహాయాన బౌద్ధ దశ (క్రీ.శ. 5వ శతాబ్దం – క్రీ.శ. 6వ శతాబ్దం):
చైత్య గుహలు: 19, 26, 29
విహారాలు: 1–7, 11, 14–18, 20–25, 27, 28
కళా వైభవం
చిత్రకళ: గుహల గోడలపై జాతక కథలు, బౌద్ధ జీవితం, సామాజిక దృశ్యాలు చిత్రించబడ్డాయి.
శిల్పకళ: బుద్ధుడి విగ్రహాలు, బోధిసత్వులు, దేవతల శిల్పాలు.
నిర్మాణ శైలి: చైత్య గుహల్లో గోపురాలు, విహారాల్లో నివాస గదులు ఉన్నాయి.
స్థానం
అజంతా గుహలు వాఘురా నది ఒడ్డున, సాహ్యాద్రి పర్వత శ్రేణిలో, ఔరంగాబాద్‌కు సుమారు 104 కిమీ దూరంలో ఉన్నాయి.
ఈ గుహలు భారతీయ బౌద్ధ కళా వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి గుహ ప్రత్యేకతను కలిగి ఉంది
07.INVENTIONS IN HISTORY 📕
పేపర్ చరిత్ర – మానవ విజ్ఞానానికి ఆధారం
మనిషి సంస్కృతిలో పేపర్ (కాగితం) ఒక మేల్కొలుపు. ఆలోచనలను, భావాలను, జ్ఞానాన్ని భద్రపరిచేందుకు పేపర్ అనేది అపూర్వ సాధనం. ఇది నేటి విజ్ఞాన సమాజానికి మూలస్తంభం.
1. పేపర్ ఆవిష్కరణ – చైనాలో జననం
పేపర్ చరిత్ర సుమారు 2000 సంవత్సరాల క్రితం చైనాలో ప్రారంభమైంది. క్రీస్తుశకం 105లో చైనా రాజరికానికి చెందిన చై లున్ అనే అధికారులు మొక్కల తంత్రము, నీటి తోడు, కొద్దిగా వస్త్రాల పదార్థాలతో మొదటి పేపర్ తయారుచేశాడు. ఇదే ఆధునిక పేపర్‌కు పునాది.
2. ప్రపంచ వ్యాప్తి
చైనా నుండి పేపర్ తయారీ నైపుణ్యం మొదట కొరియా, జపాన్ దేశాలకు చేరింది. తరువాత ముస్లింల ద్వారా అరేబియా, అక్కడి నుండి స్పెయిన్, యూరప్ దేశాలకు వెళ్ళింది. గటెన్‌బర్గ్ ముద్రణ యంత్రంతో కలిసి పేపర్ ప్రాముఖ్యత మరింత పెరిగింది.
3. భారతదేశంలో పేపర్
భారతదేశానికి పేపర్ తయారీ సాంకేతికత ముస్లిం కాలంలో వచ్చింది. అంతకుముందు మన祖先లు భూర్జపత్రం, తాడిపత్రం, రేఖా గణితం వంటి విధానాల్లో రచనలు చేసేవారు. మఘల్ కాలంలో, ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో పేపర్ వినియోగం విస్తృతమైంది.
4. ఆధునిక యుగంలో పేపర్
నేడు పేపర్ వాడకం అన్ని రంగాల్లో ఉంది – విద్య, పాలన, పత్రికలు, ప్రచురణలు, కళా రూపాలు. అయితే, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పేపర్ వాడకాన్ని సున్నితంగా జరపాలని నేడు అవసరం పెరిగింది.
ముగింపు
పేపర్ ద్వారా మనిషి భావాలను తరతరాలకు అందించగలిగాడు. చరిత్రను వ్రాయడానికి, భవిష్యత్తును నిర్మించడానికి పేపర్ పాత్ర అమోఘం. అది మౌనం గల వచనం – జ్ఞానాన్ని నిలబెట్టే ఒక చరిత్రకారుడు.
PRINTING
BULB
DYNMO
ELECTRICITY
CONCEPT ( development of human relations and human resources )04..లత సాహిత్యం ఓమర్ ఖయ్యామ్🌐
You know all secrets of this earthly sphere, Why then remain a prey to empty fear? You cannot bend things to your will, but yet Cheer up for the few moments you are here!
ఈ భూలోక రహస్యములు నీకు తెలిసినపుడు,
అయినప్పటికీ, ఎందుకు భయపడుతున్నావు?
నువ్వు నీవు ఆశించినట్లుగా విషయాలను మార్చలేవు,
కానీ, కొద్ది క్షణాలపాటు ఉన్నావు కదా, ఆనందంగా ఉండు!
08.కవితలు📕
నాకవితలు :Ch.RamaMohan,BA.
🌾 అప్పుడు – ఇప్పుడు
పరలోకం - నమ్మకం → విశ్వాసం
ఇహలోకం →నిజం → వాస్తవంతెలియని → స్వర్గమాతెలిసిన ప్రపంచమా → జీవితాన్ని స్వర్గంగా చేసుకో🍑🍑🍑🍑
సమత పంచలేని వాడు
మమత పంచలేడు
మమత పంచలేనివాడు
మహిని లేడు ఉన్నా లేనివాడే
విన్న వించ మంచి వినుము బాల
***
ఓటు
వేస్తారు ఇస్తే నోటు
చేస్తుంది దేశానికి ఎంతో చేటు
ప్రజాస్వామ్యానికి వేస్తుంది వేటు
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
కూలివాని గుండెలొ ఆవేదన ఉందని
కార్మికుని కడుపులో ఆకలి రగిలందని
కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దోపిడిదారుల దురంతాలు సాగవని
పీడకుల పాలన మాకిక వద్దని
గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దగాపడ్డ తమ్ములార ఏకంకండని
మోసపోక యికనైనా మేలుకొండని
మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
తెలుగు వెలుగు
సౌరభ సుమమాల
కోమల విరిబాల
సోభిల్లు తెలుగు వేయి విధముల
పారసికము పట్టు వదల లేదు
ఆంగ్లము వల్ల తెనుగు మనలేదు
నా భావనమ్మ తెలుగు వెలుగు
వెలుగేది
తెలుగుజాతికి దారేది
చేతిలో కప్పు cup
ఇంటిపైకప్పు
తెలుగేదొ చెప్పు
తెలుగు జల్లెడ జర ౙ
చందమామ చర ౘ
రంపము బండి ర ఱ
లేదు నా భావనమ్మ
10.గుణాఢ్యుడు🌐
గుణాఢ్యుడు ప్రాచీన భారతీయ రచయిత. అతను "బృహత్కథ" అనే గ్రంథాన్ని పైశాచీ ప్రాకృత భాషలో రచించాడు. బృహత్కథ ఇది ఒక పెద్ద కథాసంపుటి, ఇందులో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. శతవాహన రాజు హాళ కాలంలో రచించబడినదని చెబుతారు. ఈ గ్రంథం నేరుగా దొరకకపోయినప్పటికీ, దీని ఆధారంగా "కథాసరిత్సాగరము"1 (సోమదేవుడు), "బృహత్కథామంజరి"2 (బోధాయనుడు) అనే సంస్కృత అనువాదాలు వెలువడ్డాయి. గుణాఢ్యుడి కథ గుణాఢ్యుడు సంస్కృతంలో రాయలేక ప్రాకృతంలో రాశాడు. రాజు హాళ ఈ రచనను అంగీకరించకపోవడంతో, గుణాఢ్యుడు తన గ్రంథాన్ని అడవిలో కూర్చొని చదువుతూ తగలబెట్టాడని ఒక గాథ ఉంది. గుణాఢ్యుడు ప్రాముఖ్యత భారతీయ కథా సాహిత్యానికి పునాది వేసిన రచయిత. అతని కథలు తరువాతి కాలంలో జాతక కథలు, పురాణాలు వంటి అనేక గ్రంథాలకు ప్రేరణగా నిలిచాయి. గుణాఢ్యుడు "బృహత్కథ" ద్వారా కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాడు. చరిత్ర గుణాఢ్యుడు తెలంగాణ మొదటి లిఖిత కవి. గుణాఢ్యుడు 1వ శతాబ్దానికి చెందిన కవి. ఇతడు బృహత్కథ అనే ప్రాకృత కథాకావ్యాన్ని రచించాడు. ఈ కథలను దండి, సుబంధు, బానభట్టుడు లాంటి ఎందరో తర్వాతి కాలం కవులు పొగిడారు. ఇతడిని వ్యాస-వాల్మీకి కవులకు సమానంగా కొందరు కవులు పరిగణిస్తారు, అయితే ఇతడి రచన సంస్కృతంలో లేదు. ప్రస్తుతం బృహత్కథ అసలు రూపంలో అలభ్యం. ఆ కథలకు కశ్మీర సంస్కృత అనువాదాలైన క్షేమేంద్రుని బృహత్కథామంజరి, సోమదేవుని కథాసరిత్సాగరం లభ్యమవుతున్నాయి. శాతవాహన రాజు తన రాణి జలక్రీడలాడుతున్నప్పుడు ఆమె తనపై నీటిని చల్లవద్దని చెప్పటానికి సంస్కృతంలో 'మా ఉదకైః తాడయ' అంటే నీటితో ఆడవద్దు అనే వాక్యాన్ని మోదకైః అన్న పద ప్రయోగంతో చేసింది. అది విన్న రాజు రాణికి మోదకాలు(మిఠాయిలు) తెప్పించగా, ఆమె అది చూసి నవ్వి ఆతనికి సంస్కృత వాక్యార్ధాన్ని వివరిస్తుంది. అది తెలుసుకొన్న రాజు సిగ్గుపడి తన ఆస్థాన పండితులకు తాను సంస్కృతం చదవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తాడు. సద్గుణ సంపన్నుడైన ఆయనకు ఆరేళ్ళాలో సంస్కృతం నేర్పడం సాధ్యమవుతుందని తన ఆస్థాన పండితులు తెలుపగా అక్కడే ఉన్న కాతంత్ర వ్యాకరణానికి ఆద్యుడైన శర్వవర్మ కేవలం ఆరు నెలల్లో రాజుని సంస్కృతంలో పండితుడిగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. అది తెలుసుకొన్న గుణాఢ్యుడు అది అసంభవం అని, అలా చేసినట్లయితే అప్పటి నుండి నేను సంస్కృతం, ప్రాకృతం వంటి ప్రసిద్ధ భాషలను ఉపయోగించను అని ప్రతిజ్ఞ చేస్తాడు. శర్వవర్మ రాజుకోసం కొత్త వ్యాకరణ గ్రంథాలను రచించి రాజుని పండితుడిగా ఆరు నెలల్లో తీర్చిదిద్దుతాడు. ఇది తెలుసుకున్న గుణాఢ్యుడు తన పరాభవానికి గాను పైశాచీ భాషలో ఏడు లక్షల శ్లోకాలతో కూడిన పెద్ద కథల సంకలనాన్ని రచించాడు. శిష్యులు రాజు వద్దకు ఈ గొప్ప పుస్తకాన్ని తీసుకువస్తారు, కాని రాజు దానిని అంగీకరించడానికి నిరాకరిస్తాడు. అది తెలుసుకున్న గుణాఢ్యుడు రాజు తనకు చేసిన అగౌవరానికి గాను అసహనంతో, తన పుస్తకాన్ని అరణ్యవాసులకు ఒక్కొక్కటిగా చదివి వినిపించి మంటల్లోకి విసిరేయడం ప్రారంభిస్తాడు. అటుపై దాని విశేషాలను విన్న రాజు లక్ష శ్లోకాలతో కూడిన పుస్తకంలో ఏడవ భాగాన్ని ఎంతో శ్రమించి భద్రపరచగలిగాడు. అదే గొప్ప కథల పుస్తకం. ఇదే గుణాఢ్యుడు రచించిన బృహత్కథ లో మిగిలిన భాగం. నేపాల్‌కు చెందిన బుద్ధస్వామి అనే కవి, బౌద్ధ సన్యాసి, గుణాఢ్యుడు మథురలో నివసించి, అవంతి రాజు, మదన రాజు వద్ద ఆశ్రయం పొందిన సద్గురువుగా వర్ణించాడు. ఈ రెండు అభిప్రాయాల పట్ల కాశ్మీరీ అభిప్రాయం సరైనదే. బుద్ధస్వామి నేపాల్ యొక్క ధర్మబద్ధమైన పొరుగుప్రాంతాన్ని సాధించాలనే తన పట్టుదలను వ్యక్తం చేశాడు. గుణాఢ్యుడు పైశాచీ భాషలో లక్షల శ్లోకాలతో కూడిన బృహత్కథ అనే గ్రంథాన్ని రచించాడు అని, ఇది స్థాపకుడైన శాతవాహనుడి సభలో జరిగింది అని ఈ శాతవాహనుడు క్రీ.శ మొదటి శతాబ్దానికి చెందినవాడని సోమదేవుడు రాసిన కథాసరిత్సాగర పీఠికలో కూడా ప్రస్తావించబడింది. అలానే ఆయన రచించిన 'బృహత్కథ' గ్రంథానికి సంస్కృత అనువాదం క్షేమేంద్రుడు 'బృహత్కథామంజరి' పేరుతో చేశారు. రచనలు తెలుగు భాష మొదట ‘దేశి’ అని పిలువబడేది. శాతవాహనులు ‘దేశి’ ఒక భాష కాదని దీనిని చాలా చులకనగా చూసినారు.[citation needed] గుణాఢ్యుడు ‘దేశి’ భాషలో భృహత్కథ అను గొప్ప గ్రంథరాజమును వ్రాసినాడు. ఇందులో ఏడు వేల శ్లోకాలతో ఏడు కథలను వివరించాడు. శాతవాహనులు దీనిని పైశాచీ భాష పుస్తకం అని అవమానించారు. (క్రిష్టియన్ మిషనరీస్ వాళ్లకి మొదటినుచి వున్న అలవాటు ప్రకారం ఏ దేశం అయినా అక్కడి వారితోనే వాళ్ళ సంస్కృతి మీద విషం చిమ్మించడం వారి విధానం . దానిలో భాగంగానే కొత్తగా తెలుగు భాషని పూర్వపు రాజులు అవమానించారు అని కొత్త విషం నింపడానికి ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇది పూర్తిగా నిరాధారం) శాతవాహనుల రాజభాష ప్రాకృతం అయినందున పైశాచీ భాషలో ఉన్న ఈ గ్రంథం రాజు ఆదరణకు నోచుకోలేదు. అది భరించలేక గుణాఢ్యుడు బృహత్కథను కాల్చి వేసినాడు. పక్కన ఉన్నవారు ఆయనను ఊరటపరచి కొంత భాగాన్ని కాపాడిరి. ఆ మిగిలిన పత్రాలే బృహత్కథ గ్రంథం. అందలి పదకొండవ అధ్యాయానికి 'పంచవిశంతి' అని పేరు. ఇందులో త్రివిక్రమసేనునికి భేతాలుడు చెప్పిన 25 అద్భుత కథలున్నాయి. కథాసరిత్సాగరము.1 కథాసరిత్సాగరము (Katha Sarit Sagara) అనేది సంస్కృత భాషలో రాసిన ప్రముఖ కథా గ్రంథం. దీని అర్థం "కథల సముద్రం" లేదా "కథల సరోవరము". ఇది ఎన్నో చిన్న కథలను కలిగి ఉన్న గొప్ప కథా సంకలనం. దీన్ని రచించినవాడు సోమదేవుడు (Somadeva). కథాసరిత్సాగరము గురించి ముఖ్యమైన విషయాలు: రచయిత: సోమదేవుడు కాలం: సుమారు 11వ శతాబ్దం భాష: సంస్కృతం ఆధారం: ఇది పెద్దగా బృహత్కథ అనే గ్రంథం ఆధారంగా రాయబడింది. బృహత్కథను గుణాఢ్యుడు ప్రాకృత భాషలో రచించాడు, కానీ అది అసలు రూపంలో దొరకదు. నిర్మాణం: కథాసరిత్సాగరము అనేది ఫ్రేమ్ నరేటివ్ (Frame Narrative) శైలిలో ఉంది. అంటే, ఒక ప్రధాన కథలో అనేక ఉపకథలు కలిపి చెప్పబడతాయి — దాదాపు 350కి పైగా కథలు ఇందులో ఉన్నాయి. ప్రధాన కథ (Main Storyline): విఖ్యాత కథా నాయకుడు నరవాహనదత్తుడు అనే రాజకుమారుడి చుట్టూ కథ తిరుగుతుంది. అతను రాజ్యాభిషేకానికి ముందు ఎదుర్కొన్న సంఘటనలు, విభిన్న దేవతామహిళలతో వివాహాలు, సాహసాలు ఇందులో వివరించబడ్డాయి. కథాసరిత్సాగరములోని కొన్ని ముఖ్యమైన కథలు: వేతాళ కథలు (Vetala Panchavimshati) శివపురాణ సంబంధిత కథలు మంత్రక కథలు (magical stories) జానపద కథలు, మౌఖిక సాహిత్యం ఆధారంగా వచ్చిన కథలు ప్రభావం: ఈ గ్రంథం ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువదించబడింది. పాశ్చాత్యుల కథలైన The Arabian Nights లేదా The Canterbury Tales లాంటి సంకలనాలపై కూడా దీని ప్రభావం ఉంది. భారతదేశపు పురాతన కథాచిత్రాల, లలిత సాహిత్యపు గొప్ప దర్పణం. ఒక వాక్యంలో చెప్పాలంటే: కథాసరిత్సాగరము భారతీయ జానపద కథా సంపదకు ఆధారస్తంభం. |

